7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పండుగ ముందు జీతాలు పెరిగే అవకాశం..!
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే పండుగ ముందు ఉద్యోగులకు డీఏ చెల్లించే అవకాశాలు ఉన్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే పండుగ ముందు ఉద్యోగులకు డీఏ చెల్లించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సాలరీ పెరుగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. చాలా కాలంగా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది తీపికబురవుతుంది. మీడియా కథనాల ప్రకారం అక్టోబర్ చివరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై ప్రకటన వెలువడవచ్చు. పెంచిన డీఏను కేబినెట్ ఆమోదించడం వల్ల ఉద్యోగులకు పెరిగిన జీతభత్యాలు అందుతాయి. AICPI ఇండెక్స్ డేటా ప్రకారం ఈసారి కూడా ప్రభుత్వం కరువు భత్యాన్ని 4 శాతం పెంచవచ్చు.
జూన్‌లో సంఖ్య ఎంత?
జూన్‌లో ఇండెక్స్ సంఖ్య 136.4 పాయింట్లుగా ఉంది. దీన్ని బట్టి లెక్కిస్తే డీఏ స్కోరు 46.24కి చేరింది. అంటే డీఏలో మొత్తం 4% పెరుగుదల ఉంటుంది.
బేసిక్ సాలరీపై లెక్క ఎలా ఉంటుంది - రూ. 56,900
- >> బేసిక్ సాలరీ - రూ. 56,900
>> కొత్త డీఏ (46 శాతం) - నెలకు రూ. 26,174
>> ప్రస్తుత డీఏ (42 శాతం) - నెలకు రూ. 23,898
>> డీఏ ఎంత పెరిగింది - నెలకు రూ 2276
>> వార్షిక పెరుగుదల ఎంత - రూ 27312
బేసిక్ జీతం - రూ.18,000
- >> బేసిక్ వేతనం - రూ.18,000
>> కొత్త డీఏ (46 శాతం) - నెలకు రూ. 8280
>> ప్రస్తుత డీఏ (42 శాతం) - నెలకు రూ. 7560
>> డీఏ ఎంత పెరిగింది - నెలకు రూ 720
>> వార్షిక పెరుగుదల ఎంత - రూ 8640
పెరిగిన డీఏ 4 శాతం
7వ వేతన సంఘం ఈసారి కూడా ప్రభుత్వం ఉద్యోగుల వేతనాన్ని 4 శాతం పెంచనుంది. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుంది. జూలై 1, 2023 నుంచి ఉద్యోగులు పెరిగిన ప్రయోజనం పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ కోసం ఉద్యోగులు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంది. అక్టోబర్ నెలాఖరులోగా ఉద్యోగులకు ప్రభుత్వం ఈ కానుకను అందించే అవకాశాలు ఉన్నాయి.