Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today: బంగారం ధరలు భారీగా తగ్గగా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.
Gold Price Today: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు ప్రజలకు కాస్తా ఊరట కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండగా.. వెండి ధరలు మాత్రం పైపైకీ వెళ్లాయి.. దీంతో కేజీ సిల్వర్ రేట్ రికార్డ్ స్థాయికి చేరింది. తాజాగా మే 1న అంటే శనివారం ఉదయం వెండి ధరలు పతనమయ్యాయి.ఈ రోజు ఉదయం (మే 1న) 10 గ్రాముల 22 క్యారెట్లో ధర రూ. 44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని పసిడి ధరలలో కూడా భారీగానే మార్పులు జరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,370గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,570గా ఉంది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,110గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. ఇక ఇక అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కె్ట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది.
వెండి ధరలు...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు ప్రజలకు కాస్తా ఊరట కలిగిస్తున్నాయి.
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 675 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 67,500గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల ధర రూ.675 ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల ధర రూ.675 ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది.ఇక అటు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 1-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.