Gold, Silver Price Today: పసిడి మరింత ప్రియం
Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి
Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం ధర పరుగులు పెడుతున్నాయి కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. నెల క్రితం 40వేల చేరువలోకి వచ్చిన ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 310 రూపాయలు పెరిగింది. దీంతో బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం.. 45,640 కి పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 50,710 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,640 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,640 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు...
దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. కాగా బుధవారం కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండికి రెండు వేల రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 72,000 నుంచి 74,000లకు ఎగబాకింది.
దేశంలో ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000 లు ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.74,000 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.74,000 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.78,500 లు ఉంది. విజయవాడలో వెండి రూ.78,500లు వద్ద కొనసాగుతోంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.