దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర

Update: 2021-03-01 04:33 GMT

దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర

దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ -ఎంసిఎక్స్ లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా ప్రస్తుతం కాస్తంత నెమ్మదించింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.08 శాతం మేర తగ్గి 46,570 రూపాయల వద్దకు చేరగా, మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.70 శాతం క్షీణించి 67,510 వద్దకు చేరాయి. దేశీయ స్పాట్ మార్కెట్ లో 10 గ్రాముల ధర స్వల్పంగా తగ్గినప్పటికీ 48,910 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42,690 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 47,720 రూపాయలుగా నమోదవుతోంది.

Full View


Tags:    

Similar News