క్రమంగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
Gold Rates: ఉక్రెయిన్‌లో యుద్ధం భీకర స్థాయిలో జరుగుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి.
Gold Rates: ఉక్రెయిన్‌లో యుద్ధం భీకర స్థాయిలో జరుగుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గాయి. ఏపీ, తెలంగాణలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 53వేలకు చేరింది. నిన్నటితో పోలిస్తే బంగారం తులానికి 270 రూపాయలు తగ్గింది. వెండి కూడా అదే బాటలో పయనించి కిలోకు 545 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 52,900గా ఉంది. కిలో వెండి 69,300 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,922 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25 డాలర్లుగా ఉంది.