దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు

Update: 2021-03-02 05:29 GMT

దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు

Gold rate today on 02 March 2021: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ -ఎంసిఎక్స్ లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తోంది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.68 శాతం మేర ఎగసి 45,950 రూపాయల వద్దకు చేరగా మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం పెరిగి 69,541 రూపాయల వద్దకు చేరింది.

దేశీయ స్పాట్ మార్కెట్ లో 10 గ్రాముల ధర స్వల్పంగా పెరిగి. 48,910 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 43,060 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 46,730 రూపాయలుగా నమోదవుతోంది.

Tags:    

Similar News