Gold Rate Today: దీపావళి రోజు పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన బంగారం-వెండి ధరలు

Update: 2024-10-31 02:23 GMT

Gold Rate Today: దీపావళి రోజు బంగారం ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లాయి. రెండు రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 1400 మేర పెరిగింది. ఇక వెండి ధర కిలోకు ఇవాళ ఏకంగా రూ. 2100 మేర పెరిగింది. ఈ క్రమంలో అక్టోబర్ 31 దీపావళి రోజు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశవ్యాప్తంగా నేడు దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా మంది ఈరోజు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ దీపావళి రోజు పసిడిప్రియులకు భారీ షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, దేశీయంగా పండగ గిరాకీ వంటి కారణాలతో రేట్లు భారీగా పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశీ మార్కెట్లో వరుసగా బంగారం ధరలు పెరిగాయి. అంతకుముందు రోజు కాస్త తగ్గాయి.

ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగి రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31వ తేదీ దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. నేడు స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2788 డాలర్లకు పైగా పలుకుతోంది. సిల్వర్ ఔన్సు రేటు 33.89 డాలర్లకు చేరుకుంది.ఇక ఇండియన్ రూపాయి మారకం విలువ మరింత దిగజారి లైఫ్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూ. 84.120 దగ్గర అమ్ముడుపోతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. దీపావళి రోజు 22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 650 పెరిగింది. దీంతో రూ. 74వేల 400 స్థాయికిచేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర పది గ్రాములపై 710 పెరిగి రూ. 81వేల 160 కి చేరింది. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలోవెండి రేటు హైదరాబాద్ ల నేడు రూ. 2100 వరకు పెరిగింది. దీంతో కిలో ధర రూ. 1, 09,000 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1000 పెరిగి రూ 1లక్ష మార్క్ దాటేసింది.


Tags:    

Similar News