Gold Rate Today: మహిళలూ వెంటనే బంగారం కొనేయ్యండి..ఒక్కసారిగా భారీగా తగ్గిన పసిడి ధర
Gold Rate Today: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. ఒక్కరోజు తేడాలోనే బంగారం ధర ఏకంగా 10 గ్రాముల పై 2000 రూపాయలు తగ్గింది. నవంబర్ 7, గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,130 రూాపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,450 రూపాయలుగా ఉంది.
నిన్న 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 81070 రూపాయల ఉంది. అక్కడి నుంచి బంగారం ధర ఒక్కసారి గా రూ. 2,000 పతనం అవడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బంగారం ధర గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే. దాదాపు ప్రతిరోజు ఆల్ టైం రికార్డ్ స్థాయిని స్థాయి నమోదు చేసుకుంటూ. 82,000 రూాపాయల వరకు వెళ్ళింది.
అయితే మాత్రం బంగారం ధర భారీగా తగ్గడం వెనుక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం అసలు కారణంగా చెప్పవచ్చు. డోనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు డాలర్ విలువ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా బంగారం వైపు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తిరిగి స్టాక్ మార్కెట్ల వైపు తమ డబ్బులు తరలిస్తున్నారు.
ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గు ముఖం పడుతున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గడం కారణంగా అటు మహిళలు సైతం ఆనందపడుతున్నారు. గత నెలలో బంగారం ఆల్ టైం రికార్డులు నమోదు చేసుకుంటూ చుక్కలు చూపించింది. ఒక దశలో బంగారం ధర 83 వేల రూపాయల సమీపం వరకు వెళ్ళింది. ప్రస్తుతం ట్రంప్ గెలుపు కారణంగా బంగారం ధర తగ్గు ముఖం పడుతుంది.
ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2700 డాలర్ల దిగువకు వస్తోంది. ట్రెండ్ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర అతి త్వరలోనే రూ.75,000 వరకు పడిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.