Gold Rate: స్వల్పంగా పెరిగిన పుత్తడి ధర..దిగివచ్చిన వెండి ధరలు
Gold Rate: రోజూ బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.
Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒకవైపు పసిడి ధర పెరిగితే మరోవైపు వెండి రేటు మాత్రం దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీ మార్కెట్ లో ఎల్లో మెటల్ గతేడాది ఆగస్టులో గరిష్ట ధర 56వేల 200 వద్దకు చేరగా.. ఆరు నెలల వ్యవధిలో దాదాపు 18 శాతం మేర దిగివచ్చింది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 43వేల 490 రూపాయల వద్దకు చేరింది. ఇక హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 41వేల 910గా నమోదు కాగా.. 24 క్యారెట్ల ధర 45వేల 720 రూపాయల వద్దకు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర 200 రూపాయల మేర తగ్గడంతో 69,300 వద్దకు చేరింది.