Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Rate Today: బంగారం ధరలు సెప్టెంబర్ 1, ఆదివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,750 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు శనివారంతో పోల్చి చూసినట్లయితే 200 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. పసిడి ధరలు సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు గత వారం రోజులుగా చలామణి అవుతున్నాము సంగతి తెలిసిందే.

ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వు భేటీ కారణంగా కీలక వడ్డీరేట్లను పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందనే వార్తలు బంగారం మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు ఈ నెలలోనే ఆల్ టైం గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయల మార్కును దాటే అవకాశం ఉన్నట్లు, నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు గడచిన ఆగస్టు నెలలో భారీగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి ఒక దశలో బంగారం ధర 68 వేల రూపాయల వరకు పతనం అయింది. కానీ అక్కడి నుంచి రికవరీ అవుతూ బంగారం ధర 74 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం 73 వేల రేంజ్ లో ట్రేడ్ అవుతోంది.ఫ్యూచర్లో బంగారం ధర ఆల్ టైం గ రిజిస్టర్ స్థాయి 75 వేల రూపాయలను దాటే అవకాశం ఈ నెలలో కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అటు అంతర్జాతీయంగా కూడా అమెరికాలో బంగారం ధర ప్రస్తుతం 2550 డాలర్ల మార్కు ఎగువన ట్రేడ్ అవుతోంది.ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో భారీ పెరుగుదలను సూచిస్తున్నాయి. మరోవైపు చైనా వైఖరి కూడా బంగారం పెరగడానికి దోహదం చేస్తోంది. చైనా సెంట్రల్ బ్యాంకు పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. దీంతో బంగారం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకొని ఉంది.
ఫలితంగా దేశీయంగా కూడా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మీరు నగల షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క గ్రాములో తేడా వచ్చినా మీరు వేలల్లో నష్టపోతారు. వీటన్నింటినీ బేరీజు వేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయాలి. లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.