Gold Rate: బంగారం ధరలు పైపైకి.. ఎగసిపడుతున్న వెండి ధరలు!

Gold Rate: రెండో రోజూ బంగారం ధరలు పైకి కదిలాయి. ఈరోజు బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు భారీగా పైకెగశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-18 04:33 GMT

బంగారం ధరలు గురువారం కొద్దిగా పెరుగుదల నమోదు చేసాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు పెరుగుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (18.12.2020) కొద్దిగా పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (18.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటే 200 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 46,400 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేయడంతో 50 వేలరూపాయల మార్క్ దాటి కొనసాగుతోంది. దీంతో 50,600 రూపాయలుగా ఉంది..

వెండి ధరలు భారీ పెరుగుదల..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేస్తే.. వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1700 రూపాయలు పెరిగాయి. దీంతో 70 వేల రూపాయల స్థాయికి పెరిగిపోయింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 70,600 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (18.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటే 200 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 46,400 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేయడంతో 50 వేలరూపాయల మార్క్ దాటి కొనసాగుతోంది. దీంతో 50,600 రూపాయలుగా ఉంది..

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటే 410 రూపాయల పెరుగుదల నమోదుచేసింది. దీంతో 48,760 రూపాయల వద్దకు చేరుకున్నాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధర కంటే 210 రూపాయల పెరుగుదల నమోదుచేసింది 52,960 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 1400 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 67 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News