Gold Rate: కిందికి దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గుదల బాటలోనే!

Gold Rate: నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కిందికి దిగొచ్చాయి. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు భారీస్థాయిలో తగ్గాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-15 02:44 GMT

బంగారం ధరలు సోమవారం స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. దీంతో మంగళవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (15.12.2020) స్వల్పంగా తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల బాటలోనే నడిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (15.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటె 210 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,800 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 230 రూపాయల తగ్గుదలతో 50 వేలరూపాయల మార్క్ కంటె కిందికి దిగొచ్చింది. దీంతో 49,960 రూపాయలుగా బంగారం ధరలు ఉన్నాయి.

వెండి ధరలు మళ్ళీ కిందికి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే..వెండి ధరలు కూడా కిందికి దిగొచ్చాయి. అయ్యాయి. వెండి ధరలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 400 రూపాయలు తగ్గాయి. దీంతో 63 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 63,200 రూపాయల వద్ద ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (15.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కంటె 210 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,800 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 230 రూపాయల తగ్గుదలతో 50 వేలరూపాయల మార్క్ కంటె కిందికి దిగొచ్చింది. దీంతో 49,960 రూపాయలుగా బంగారం ధరలు ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 210 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 47,950 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 230 రూపాయల తగ్గుదల నమోదు చేసి 52,310 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 63,200 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News