Gold Rate Today: ఎగసిన బంగారం ధరలు

Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి.

Update: 2021-02-15 04:39 GMT

gold 

Gold Rate Today: దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు మరోమారు పరుగులు పెడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం కొద్ది రోజుల నుంచి విలువైన లోహాల ధరలు దిగివచ్చినట్టు కనిపించాయి. అయితే అది తాత్కాలికమే అయింది. మళ్ళీ విలువైన లోహాల ధరలు పై చూపులు చూడటం మొదలెట్టాయి. దేశీ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ MCX లో తాజా సెషన్ లో పది గ్రాముల పుత్తడి 0.15 శాతం పైగా ఎగసి 47 వేల 387 రూపాయల వద్ద కదలాడుతోంది. మరో విలువైన లోహం వెండి ధర సైతం 1.14 శాతం పుంజుకుని.. కిలో వెండి 69 వేల 908 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ లో 22 గ్రాముల పసిడి 661 రూపాయలకు పైగా ఎగసి 46 వేల 847 రూపాయల వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి (Gold) డిమాండ్ పెరిగిన కారణంగా దేశీయంగానూ ఎల్లోమెటల్ ధరలు పరుగులు తీస్తున్నాయి.

Tags:    

Similar News