Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

Gold Rate: బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు పతనమైయ్యాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-03-13 01:50 GMT

gold rate today 

Gold Rate: బంగారం ధరలు శుక్రవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో మళ్లీ మార్కెట్లు తగ్గుదలతో ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (13.03.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ కిందికి దిగివచ్చాయి. శుక్రవారం (12.03.2021) బంగారం ధరలు నిన్నటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,850 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 45 వేలరూపాయల మార్క్ వద్ద కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,650 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు తగ్గుదల..

బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు భారీగా తగ్గదుల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరకంటె 2500 రూపాయలు తగ్గింది. దీంతో 70 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ధర కేజీకి 70,700 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజూ కాస్త కిందికి దిగివచ్చాయి. శనివారం (13.03.2021) బంగారం ధరలు శుక్రవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,850 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45వేలరూపాయల మార్క్ వద్దకు నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,650 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 300 రూపాయలు తగ్గి 44,000 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 330 రూపాయలు తగ్గి 48,000 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 2500 రూపాయలు దగ్గుదల నమోదు చేసి 67 వేల రూపాయల స్థాయిలో నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,600 రూపాయలుగా నమోదు అయింది. హైదరాబాద్ తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధరలు 3100 రూపాయలు తక్కువగా ఉంది.

Tags:    

Similar News