Gold Rate Today: మహిళలకు ఊరటనిచ్చే వార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర కొద్దిగా తగ్గింది. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,230 నమోదు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,790 రూపాయలుగా నమోదు అయ్యింది. బంగారం ధరలు నేటికి కూడా రికార్డు స్థాయి సమీపంలోనే ఉన్నాయి.

గతవారం బంగారం ధర 78 వేల రూపాయల పైన రికార్డు ధరను స్థాపించింది. రికార్డు ధరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుతం 800 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ కారణాలవల్ల హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ముఖ్య కారణం పశ్చిమాసియా దేశాల్లో నెలకొని ఉన్న యుద్ధ వాతావరణమే ఒక కారణంగా చెప్తున్నారు. అంతర్జాతీయంగా వాణిజ్యం ఈ యుద్ధ వాతావరణం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు బంగారం ధర దేశీయంగా కూడా పెరగడానికి ప్రధాన కారణం ప్రస్తుతం దసరా దీపావళి ధన త్రయోదశి ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో సాధారణంగానే సంవత్సరం మొత్తం తో పోల్చి చూస్తే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ కారణంగా కూడా బంగారం ధర దేశీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర నుంచి ముందుకు వెళ్లి పెరుగుతుందా.. లేక తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం ధర 80,000 రూపాయలు దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా తూకం విషయంలోనూ నాణ్యత విషయంలోను ఏమాత్రం రాజీ పడవద్దని నిపుణులు సూచిస్తున్నారు.