Gold Rate: కాస్త దిగొచ్చిన బంగారం ధరలు.. భారీస్థాయిలో పడిపోయిన వెండి ధరలు!

Gold Rate: వరుసగా పెరుగుతూ వస్తున్నబంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో కిందికి దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-07 01:00 GMT

బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం కాస్త నిదానించాయి. దీంతో ఈరోజు స్వల్ప తగ్గుదలతో మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (07.12.2020) కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పతనం చవి చూశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (07.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు కిందికి కదిలి 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,070 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు భారీ పతనం..

బంగారం ధరలు కొద్దిగా కిందికి కదిలితే, మరోవైపు వెండి ధరలు భారీ స్థాయిలో పతనం నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఏకంగా 3610 రూపాయలు పతనం అయింది. దీంతో 64 వేలరూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 63,900 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.సోమవారం (07.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు కిందికి కదిలి 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,070 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు తగ్గింది. దీంతో 48,050 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం శనివారం నాటి ప్రారంభ ధర కంటె 20 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 52,650 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు కొద్దిగా కిందికి దిగివచ్చాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 110 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 64 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 63,900 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News