రోజురోజుకూ దిగివస్తున్న బంగారం ధర!

* తగ్గుతున్న గోల్డ్ రేటు * మళ్లీ పెరగవచ్చంటున్న మార్కెట్ వర్గాలు * దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింతగా డౌన్

Update: 2021-02-05 07:49 GMT
బంగారం ధరలు 

దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింతగా దిగివచ్చింది. బడ్జెట్ లో గోల్డ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దేశీయ విఫణిలో పుత్తడి ధర మరింతగా దిగివస్తోంది. దేశీ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర 47 వేల 600 రూపాయల వద్దకు చేరింది..మరో విలువైన లోహం వెండి 1.55 శాతం మేర తగ్గడంతో కిలో వెండి ధర 68 వేల వద్దకు చేరింది దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 46,600 రూపాయలుగా నమోదు కాగా ముంబయ్ లో 46,590, చెన్నయ్ లో 44,410 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఎల్లోమెటల్ ధర 48,520 రూపాయల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటు డాలరుతో పోలిస్తే రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగివస్తున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News