Gold Rate: దిగొస్తోన్న బంగారం ధరలు
Gold Rate: ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి
Gold Rate: బంగారం ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. బంగారం ధర బాటలో కాకుండా వెండి రేటు మాత్రం పైకి ఎగబాకుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కట్ లో బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు శనివారం కూడా నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. దీంతో రేటు రూ.45,490కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.41,700కు క్షీణించింది.
వెండి ధరలు పైకి..
హైదరాబాద్‌లో నేటి ఉదయం వెండి ధరలు గత 10 రోజుల్లో 4 సార్లు పెరిగాయి, 4 సార్లు తగ్గాయి, 2 సార్లు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ధర కొద్దిగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500 ఉంది. నిన్న ధర రూ.100 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.556 ఉంది. నిన్న ధర 0.80 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.69.50 ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. 6 నెలల కాలంలో ఫిబ్రవరి 1న వెండి ధర అత్యధికంగా రూ.79,200 ఉంది. దాంతో పోల్చితే వెండి ధర ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి.
అంతర్జాతీయంగా పెరిగిన బంగారం ధరలు
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదలతో 1731 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 25.11 డాలర్లకు ఎగసింది.
దేశంలో కరోనా కేసులు ఎంతలా పెరిగినా మళ్లీ లాక్‌డౌన్ ఉండదు అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చెబుతుంటే ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంపై పెట్టుబడులు పెట్టట్లేదు. అదే లాక్‌డౌన్ ఉంటుంది అనే ప్రచారం జరిగితే మళ్లీ దేశం కష్టాల్లోకి వెళ్లిపోతుంది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారంపై పెట్టేవారు. ఆ పరిస్థితి లేకపోవడంతో బంగారానికి డిమాండ్ కనిపించట్లేదు. అందువల్ల 7 నెలల 20 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.