Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధర..తులంపై ఎంత తగ్గిందంటే
Gold Price Today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.వెండి కూడా తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price Today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 67,140కి చేరుకుంది. శుక్రవారం ధర రూ. 67,150గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 6,714గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 73,240కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 73,250గా ఉండేది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67, 290గా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,390గాను ఉంది. ముంబై,బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం...వంద గ్రాముల వెండి ధర రూ. 8,840గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 88,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 88,500గా ఉండేది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 93,400గా ఉంది.