Gold Rates: బంగారం ధర బాగా తగ్గింది.. ఇప్పుడే కొనాలా, ఇంకొన్ని రోజులు ఆగాలా?

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా శుభవార్తే. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.74,430కి చేరింది.

Update: 2024-05-27 07:43 GMT

Gold Rates: బంగారం ధర బాగా తగ్గింది.. ఇప్పుడే కొనాలా, ఇంకొన్ని రోజులు ఆగాలా?

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా శుభవార్తే. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.74,430కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.66,390 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల ధోరణుల కారణంగా బంగారం ధర తగ్గినట్టుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి?

అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో గత కొన్ని సెషన్లలో బంగారం ధరలు కొంత లాభపడ్డాయి. రానున్న రోజుల్లో రిజర్వ్ రేట్లను తగ్గించే అవకాశాలు లేవనే సంకేతాలు రావడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను త్వరలో తగ్గించబోదని, ఈ ఏడాది చివర్లో రేట్ల తగ్గింపు తక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు నమ్ముతుండటంతో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు పడిపోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు శుక్రవారం నాడు రెండు వారాల కనిష్టాన్ని తాకాయి.

కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకుల కారణంగా బ్రేకులు పడ్డాయి.

ఏమైనా, అక్షయ తృతీయ సీజన్‌లో బాగా పెరిగిన బంగారం ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ధరలు రానున్న రోజుల్లో మరి కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు.

అయితే, కొనుగోళ్ళు చేయదలచిన వారు ఇప్పుడే బంగారాన్ని తక్కువ మొత్తంలో కొనుగోలు చేయవచ్చని, రానున్న రోజుల్లో మరింత తగ్గినప్పుడు మరికొంత కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఈ ధరల తగ్గుదల ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, దీర్ఘకాలంలో మాత్రం పసిడి పైపైకే వెళుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News