Gold Rate: దేశీయ మార్కెట్లో దిగివస్తున్న బంగారం ధరలు
Gold Rate: దేశీయ మార్కెట్లో గత వారం రోజులుగా దిగివస్తున్నధరలు
Gold rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు దిగివస్తున్నాయి గ్లోబల్ మార్కెట్ లో పుత్తడికి డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర గత వారం రోజులుగా దిగివస్తోంది...ఏడాది మొదట్నుంచీ ఇప్పటివరకు ఎల్లోమెటల్ ధర 7.9 శాతం లేదా మూడు వేల 946 రూపాయల మేర తగ్గింది 50 రోజుల వ్యవధిలో పసిడి దాదాపు 4 వేల రూపాయలు తగ్గగా మరో విలువైన లోహం వెండి 11 వందల రూపాయల మేర పెరుగుదల నమోదు చేసింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 56,200 రూపాయల వద్ద గరిష్ట స్థాయికి చేరింది.
దేశ రాజధానిలో ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరితంగా తగ్గడంతో 47,770 వద్దకి చేరింది హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల ధర 43,390 వద్దకు చేరగా 24 క్యారెట్ల పుత్తడి ధర 47,340 రూపాయలుగా నమోదయింది