దేశీయ మార్కెట్ లో దిగివచ్చిన పుత్తడి

* కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు, గ్లోబల్ మార్కెట్ లో తగ్గిన డిమాండ్ * స్పాట్ మార్కెట్ లో రూ.51 వేలకు ఎగువన గోల్డ్

Update: 2021-02-04 08:56 GMT

Representational Image

శీయ మార్కెట్లో బంగారం ధర మరింతగా దిగివచ్చింది కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు తోడు గ్లోబల్ మార్కెట్ లో మందగించిన డిమాండ్ నేపథ్యంలో దేశీయ విఫణి ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర దిగివస్తోంది. తాజా సెషన్ లో 0.85 శాతం క్షీణించగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 47 వేల 410 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ధర సైతం 1.55 శాతం మేర తగ్గి కిలో వెండి ధర 67 వేల ఎగువన కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 51,160 రూపాయలుగా నమోదు కాగా ముంబయ్ లో 49,000, చెన్నయ్ లో 49,400 రూపాయల వద్దకు చేరింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఎల్లోమెటల్ ధర 49,130 రూపాయల వద్దకు చేరింది.

Tags:    

Similar News