Gold Rate: వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజుకూడా గోల్డ్ రేట్ తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold-Silver Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజుకూడా గోల్డ్ రేట్ తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800తగ్గగా..నేడు రూ. 400 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 63,500గా ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 870 తగ్గింది. ఈ రోజు రూ.440వరకు తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 69, 270 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 63,500గా ఉంది. 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 69, 270గా ఉంది. దేశ రాజధాని ఢిల్లిలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,650 ఉండగా..24క్యారెట్ల ధర రూ. 69,420 పలుకుతోంది. బెంగళూరు, కోల్ కతా, పూణే, కేరళలో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 63,500ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 69, 270గా నమోదు అయ్యింది.
ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. బులియన్ మార్కెట్లో నిన్న కిలో వెండి ధర రూ. 3,200 తగ్గింది. నేడు రూ. 500 వరకు తగ్గింది. నేడు కిలో వెండి రూ. 82,000గా నమోదు అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ వెండి కిలో ధర రూ. 87,000గా ఉంది.