Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో బంగారం, వెండిధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతుంటే పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర గడిచిన వారం రోజుల్లో దాదాపు 6వేల వరకు తగ్గింది. దీంతో బంగారం కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. బడ్జెట్ ప్రకటించిన రోజు బంగారం ధర పది గ్రాములు ఏకంగా 4వేలు తగ్గింది. ఇక బంగారం ధర ప్రస్తుతం భారత్ లో 9వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి.
కాగా వచ్చేది శ్రావణమాసం కావడంతో బంగారం ఇలాగే తగ్గుతూ వస్తే..పసిడి ప్రియులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారని నిపుణులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో ఈ మాసంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఏర్పడుంది.ఇక ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,160 ఉండగా..22 క్యారెట్ల ధర రూ. 63,950గా ఉంది. వెండి కిలో ధర రూ. 89,000. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,160 ఉండగా..22 క్యారెట్ల ధర రూ. 63,950గా ఉంది.