Gold and silver prices today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే నేడు సెప్టెంబర్ 30 తేదీ సోమవారం తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: నేడు బంగారం ధరలు విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,429 పలుకుతోంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,979 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 60 రూపాయలు తగ్గింది. అయినప్పటికీ బంగారం ధర ఇప్పటికీ ఆల్ టైం రికార్డు స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయ కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పవచ్చు.ముఖ్యంగా బంగారం అమెరికాలో ప్రస్తుతం 2700 డాలర్లకు ఒక ఔన్సు చొప్పున పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. దీనికి తోటి బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం పచ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.
ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలతో పాటు, సిరియాపై అమెరికా దాడుల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఏర్పడింది. యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లలో పతనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఈ దెబ్బతో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా బంగారం ధర నూతన గరిష్ట సాయి 78,000 రూపాయలను తాకింది. బంగారం ధర అటు దేశీయంగా కూడా పెరిగేందుకు సిద్ధంగా ఉంది. మరికొన్ని రోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈ ఫెస్టివల్ సీజన్లో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే బంగారం ధర రూ. 80 వేలు తాకే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధర ఈ సంవత్సరం చివరి నాటికి రూ. 90 వేల నుంచి రూ. 1 లక్ష మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.