Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?

Gold and Silver Prices Today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు నేడు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

Update: 2024-08-11 01:17 GMT

Gold Rate Today: మహిళలకు అదిరిపోయే వార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold and Silver Prices Today : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో వివాహాదిశుభకార్యాలు షురూ అయ్యాయి. ఈ నెలలోనే లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలోనే బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారకుల భారీ ఊరట లభించింది. అయితే ఇంకా తగ్గుందని ఆశపడినవారికి షాక్ తగిలింది. ఎందుకంటే నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆగస్టు 11, 2024న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా వంద డాలర్లకు పైగా ధర పెరిగింది. ప్రస్తుతం స్పట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2431 డాలర్లు ఉంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 27.46 డాలర్ల వద్ద ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. ఏకంగా 820 పెరిగింది. దీంతో 70,090వద్దకు చేరింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 64, 250కి చేరింది. ఢిల్లీలో 22క్యారెట్ల ధర రూ. 750 పెరిగి 64, 400కు చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 820, పెరిగి 70,240 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 4500 మేర పడిపోయింది. అయితే ఇవాళ మళ్ల పెరిగింది. ఒక్కరోజులోనే వెండి ధర ఏకంగా 1500 పెరిగింది. పైన పేర్కొన్న ధరలు విజయవాడ, విశాఖలోనూ ఇవే ఉన్నాయి. 

Tags:    

Similar News