Gold Rate: భారీగా పతనమైన బంగారం.. ఈరోజు ధరలు చూస్తే షాకవ్వాల్సిందే..!

Gold Rate: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. నేడు మరోసారి బంగారం ధరల్లో భారీ పతనం నమోదు అయ్యింది. నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

Update: 2024-07-25 06:14 GMT

Gold Rate: భారీగా పతనమైన బంగారం..ఈరోజు ధరలు చూస్తే షాకవ్వాల్సిందే

Today Gold Rate: బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తునట్లు ప్రకటించడంతో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి కుదించినట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. దీంతో అదే రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ఆ తర్వాత రోజు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.

గురువారం జులై 25న కూడా బంగారం రేట్లు భారీగానే తగ్గాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 64వేలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69, 820కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64, 150 ఉండగా 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 69,950గా ఉంది. బుధవారంతో పోల్చితే ఈరోజు బంగారం, ధరల్లో తగ్గుదల ఉంది. ఒక్క తులానికి 950 రూపాయలు తగ్గింది. బడ్జెట్ లో వచ్చిన తాజా ప్రకటనతో బంగారం ధరల్లో ఈ భారీ మార్పులు వస్తున్నాయి.

గత వారం రోజుల్లో బంగారం ధర భారీగా పతనం అయ్యింది. దాదాపు రూ. 5వేల రూపాయల వరకు తగ్గింది. ఈ ధరలు జనాన్ని బంగారం దుకాణాలవైపు పరుగులు తీసేలా చేస్తున్నాయి. రిటైల్ వినియోగదారులు కొనుగోళ్ల బాట పడుతున్నారు. అటు వెండి కూడా భారీగా పతనం అవుతోంది. వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు గత వారం రోజుల్లోనే రూ. 8వేలు తగ్గింది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి రూ. 91,900 వరకు చేరుకుంది. బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మళ్లీ ఛాన్స్ కూడా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News