Gold Rate: దేశీయ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు
ఈరోజు స్థిరంగా బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం కొద్ది రోజుల నుంచి విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి . దేశీ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ MCX లో తాజా సెషన్ లో పది గ్రాముల పుత్తడి 0.30 శాతం మేర స్వల్పంగా పుంజుకుని 47 వేల 381 రూపాయల వద్ద కదలాడుతోంది.
మరో విలువైన లోహం వెండి ధర సైతం 0.79 శాతం పుంజుకుని కిలో వెండి 70,681 రూపాయల వద్ద ట్రేడవుతోంది ఇక దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ లో 22 గ్రాముల పసిడి 19 రూపాయల మేర స్వల్పంగా తగ్గి 46,826రూపాయల వద్దకు చేరింది అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు రూపాయి బలోపేతం కావడంతో పసిడి డిమాండ్ స్వల్పంగా తగ్గినట్లయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.