కరోనా ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు కాగా..అదే బాటన దేశీ స్టాక్ మార్కెట్లు పయనించాయి..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు కాగా..అదే బాటన దేశీ స్టాక్ మార్కెట్లు పయనించాయి..ఆరంభ ట్రేడింగ్ లోనే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 308 పాయింట్ల మేర దిగజారగా...నిఫ్టీ 11,650 దిగువకు చేరింది...చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 172 పాయింట్ల మేర క్షీణించి 39,749 వద్దకు చేరగా...నిఫ్టీ 58 పాయింట్ల మేర నష్టంతో 11,670 వద్ద స్థిరపడ్డాయి..అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగింపు నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత వాతావరణం కొనసాగింది.