Geysers Discount: చలికాలంలో తక్షణమే వేడినీరు..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తక్కువ ధరకే గీజర్లు..!

Geysers Discount: చలికాలంలో వాతావరణం మంచుతో కూడి ఉంటుంది. ఉదయమే చన్నీళ్ల స్నానం అంటే అందరు భయపడుతారు.

Update: 2023-10-10 10:30 GMT

Geysers Discount: చలికాలంలో తక్షణమే వేడినీరు..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తక్కువ ధరకే గీజర్లు..!

Geysers Discount: చలికాలంలో వాతావరణం మంచుతో కూడి ఉంటుంది. ఉదయమే చన్నీళ్ల స్నానం అంటే అందరు భయపడుతారు. ఈ పరిస్థితిలో వేడినీరు తప్ప మరొక మార్గం లేదు. అయితే చాలామంది గ్యాస్ స్టవ్‌పై నీటిని వేడి చేస్తారు. దీనివల్ల గ్యాస్‌ నష్టమే కాకుండా నీరు వేడి కావడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో గీజర్‌ చాలా ఉపయోగపడుతుంది. నిమిషాల్లో మీకు వేడినీటిని అందిస్తుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గీజర్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

BAJAJ 3 L Geyser

ఇది బహుశా ఫ్లిప్‌కార్ట్‌లో లభించే చౌకైన గీజర్. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండి, బయట చదువుతున్నట్లయితే లేదా పని చేస్తున్నట్లయితే ఈ గీజర్ మీకు సరైన ఎంపిక అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ గీజర్‌ను కస్టమర్లు రూ. 6999కి కొనుగోలు చేయవచ్చు. అయితే దీని వాస్తవ ధర రూ.12200 కానీ 42 శాతం తగ్గింపు లభిస్తుంది.

Crompton 15 L Water Geyser

కస్టమర్‌లు ఈ గీజర్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.5974కి కొనుగోలు చేయవచ్చు. దీని వాస్తవ ధర రూ. 11,750. అయితే 49 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది 15 లీటర్ గీజర్ కాబట్టి చిన్న కుటుంబానికి సరైన ఎంపిక అవుతుంది. దీని డిజైన్ చిన్న ప్రదేశాలకు సరిపోయే విధంగా ఉంటుంది. ఇందులో రెగ్యులేటర్, ఇండికేటర్ చూడవచ్చు. ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది.

Kenstar 15 L Geyser

కస్టమర్లు ఈ గీజర్‌ని కొనడం వల్ల చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

వాస్తవానికి దీని ధర రూ. 20,990 ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌ను అంది స్తోంది. పూర్తి 63% తగ్గింపుతో కస్టమర్‌లు ఈ గీజర్‌ని కేవలం రూ. 7,599కి కొనుగోలు చేయవచ్చు. రూ.9,491 ఆదా చేయవచ్చు. ఈ గీజర్ చతురస్రాకార ఆకృతిలో ఉంటుంది.

Tags:    

Similar News