LIC: ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు రూ. 12 వేల పెన్షన్‌.. పూర్తి వివరాలు..!

LIC Saral Pension Plan: మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలా మంది ఆర్థికపరమైన క్రమ శిక్షణను పాటిస్తున్నారు.

Update: 2024-08-26 13:30 GMT

LIC: ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు రూ. 12 వేల పెన్షన్‌.. పూర్తి వివరాలు..!

LIC Saral Pension Plan: మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలా మంది ఆర్థికపరమైన క్రమ శిక్షణను పాటిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌ వచ్చే ప్లాన్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసీ ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌లో ఒక్కసారిగా పెట్టుబడితే నెలవారీ పెన్షన్‌ పొందొచ్చు. ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు.? ఎంత పెట్టుబడి పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ సరల్ పెన్షన్‌ ప్లాన్‌లో 40 ఏళ్లలోపు ఉన్న వారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ఈ పాలసీ కింద నెలవారీ కనీస యాన్యుటీని రూ. 1,000 కొనుగోలు చేయాలి. ప్రత్యామ్నాయంగా, మీరు త్రైమాసికానికి కనీసం రూ. 3,000, సెమీ-వార్షిక రూ. 6,000 లేదా సంవత్సరానికి రూ. 12,000 ఎంచుకోవచ్చు. ఇక ఈ పాలసీలో మీకు నచ్చినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇంతే పెట్టుబడి పెట్టాలనే షరతు ఏం లేదు. ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత.. మీరు మీ పెన్షన్‌ను ఏటా, సెమీ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీగా తీసుకునే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు మీకు నెలకు రూ. 12 వేల పెన్షన్‌ పొందాలని ఉంటే. అందుకోసం మీరు రూ. 30 లక్షల వార్సికాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే మీరు ఏడాదికి రూ. 50,250 పెన్షన్‌గా పొందొచ్చు. ఇక రూ. 2.5 లక్షలు సింగిల్‌ ప్రీమియంగా పెట్టుబడి పెడితే నెలవారీ రూ. 1000 పెన్షన్‌ పొందొచ్చు. లేదంటే ఏడాదికి ఒకేసారి రూ. 12,000 పెన్షన్‌ కూడా పొందే అవకాశం లభిస్తుంది.

ఇదిలా ఉంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత పాలసీలో రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుడు తీవ్ర అనారోగ్యానికి గురైతే, మీరు ఆరు నెలల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు. మీరు పాలసీ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత దానిపై లోన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, కొనుగోలు చేయాలనుకుంటే ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను (www.licindia.in) సందర్శించాలి. 

Tags:    

Similar News