LIC Policy: ప్రతినెలా రూ.11వేల పెన్షన్ కావాలా.. ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటే సరి.. లైఫ్ అంటే నో టెన్షన్..!
LIC POlicy News: మీకు నెలకు రూ.11,000 పెన్షన్ కావాలా...? అవును అయితే, LIC మీ కోసం ఓ అద్భుతమైన పాలసీని తీసుకొచ్చింది.
LIC Policy News: మీకు నెలకు రూ.11,000 పెన్షన్ కావాలా...? అవును అయితే, LIC మీ కోసం ఓ అద్భుతమైన పాలసీని తీసుకొచ్చింది. ఇందులో మీరు కష్టపడకుండానే ప్రతి నెలా డబ్బు పొందుతారు. ఎల్‌ఐసీ పిల్లల నుంచి వృద్ధుల వరకు మంచి రాబడిని అందించే పాలసీని రూపొందించింది. ఈ రోజు మనం అలాంటి ఓ అద్భుమైన LIC పాలసీ గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు ప్రతి నెలా భారీ పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఈ పాలసీ పేరు న్యూ జీవన్ శాంతి పాలసీ. LIC ఈ పథకంలో, మీరు పరిమిత పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు.
LIC యాన్యుటీ ప్లాన్..
LIC స్కీమ్ అనేది యాన్యుటీ ప్లాన్. కొనుగోలు చేసిన తర్వాత మీ పెన్షన్ మొత్తం ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి నెలా LIC నుంచి డబ్బు పొందుతారు. మీరు ఈ పాలసీలో 2 రకాల ఎంపికలను పొందుతారు. ఇందులో మొదటిది డిఫెర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, రెండవది డిఫెర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్.
లోన్ సౌకర్యం..
డిఫర్డ్ యాన్యుటీ కింద, మీరు ఒక వ్యక్తికి పెన్షన్ స్కీమ్ తీసుకోవచ్చు. 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ పథకాన్ని కొనుగోలు చేయడానికి, మీరు కనీసం రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టాలి. మరోవైపు, మీకు పాలసీ నచ్చకపోతే, ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. దీనితోపాటు ఎల్‌ఐసీ నుంచి రుణ సదుపాయం కూడా లభిస్తుంది.
నెలకు రూ.11,000 పెన్షన్ ఎలా పొందాలంటే?
ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే, రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేయడం ద్వారా ప్రతి నెలా రూ.11,192 పెన్షన్‌గా పొందుతారు. అయితే, మీరు రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ.1000 పెన్షన్‌గా లభిస్తుంది. ఇది కాకుండా, మీరు వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక ప్రాతిపదికన కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
నామినీకి డబ్బు ఎప్పుడు వస్తుంది?
ఏ వ్యక్తి అయినా యాన్యుటీని తీసుకొని చనిపోతే, నామినీకి డిపాజిట్ చేసిన మొత్తం డబ్బు అందుతుంది. దీనితో పాటు, పాలసీదారు జీవించి ఉంటే, అతను కొంత కాలం తర్వాత పెన్షన్ పొందడం ప్రారంభిస్తాడు. మరోవైపు, ఉమ్మడిగా తీసుకుంటే ఒకరు చనిపోతే, మరొకరికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. మరోవైపు, ఇద్దరూ చనిపోతే నామినీకి మొత్తం డబ్బు వస్తుంది.