Forbes List: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ..

Gautam Adani: భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani) ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.

Update: 2022-07-21 11:07 GMT

Forbes List: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ..

Gautam Adani: భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani) ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. తాజాగా రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితాను తాజాగా బిజినెస్‌ మేగజీన్ ఫోర్బ్స్‌ ప్రకటించింది. 60 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం సంపద తాజాగా 115 లక్షల 50వేల కోట్ల డాలర్లకు చేరింది. 104 లక్షల కోట్ల 60వేల కోట్ల డాలర్ల సంపద ఉన్న మైక్రోసాప్ట్‌ వ్యవస్థాకుడు బిల్‌గేట్‌ను గౌతమ్‌ అదానీ వెనక్కి నెట్టేశారు. 90 లక్షల కోట్ల డాలర్ల సంపదతో మరో భారత కుబేరుడు అనిల్‌ అంబానీ మాత్రం పదో స్థానంతో సరిపెట్టుకున్నారు. 235 లక్షల 80వేల కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా టెస్లా, స్పెస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తన అగ్ర స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు.

2070 నాటికి భారత్‌ జీరో కార్బన్‌గా మార్చాలనే ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా మౌలికవసతులు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో అదానీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అంతేకాకుండా రెండేళ్లుగా అదానీ సంస్థల పోర్టులు, ఎనర్జీ షేర్లు ఏకంగా 600 శాతం పెరిగాయి. దీంతో అదానీ సంపద భారీగా పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్‌ వివరించింది. గత మూడేళ్లలో అదానీ సంస్థలు ఏడు విమానాశ్రాయాలను సొంతం చేసుకుని దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌పోర్టు ఆపరేటర్‌గా ఎదిగినట్టు స్పష్టం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రధాన పోర్టుల్లో ఒకటైన హైఫా ఓడరేవునులోనూ భాగస్వామ్యం పొందినట్టు గౌతమ్‌ అదానీ ప్రకటించారు.

అంతేకాకుండా టెలికాం రంగంలోకి కూడా అదానీ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ కోసం రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా నెట్‌వర్క్‌ కూడా వేలంలో పాల్గొంటోంది. అయితే టెలికాం రంగంలోకి మాత్రం అడుగుపెట్టడం లేదని అదానీ సంస్థ ప్రకటించింది. కేవలం తమ సంస్థల ఆధ్వర్యంలోని ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకే 5జీ స్పెక్ట్రమ్‌ తీసుకుంటున్నట్టు అదానీ సంస్థలు తెలిపాయి. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ఈనెల 26న జరగనున్నది. 60వ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలకు 60వేల కోట్ల రూపాయలను అందజేస్తానని గౌతమ్‌ అదానీ గతనెలలో ప్రకటించారు.

Tags:    

Similar News