Indian Railway Facts: అతిపెద్ద రైల్వే జంక్షన్ నుంచి.. అతిచిన్న స్టేషన్ వరకు.. భారతీయ రైల్వేల గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Indian Railway Interesting Facts: భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద నెట్‌వర్క్, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కుతుంటారు.

Update: 2023-09-12 07:18 GMT

Indian Railway Facts: అతిపెద్ద రైల్వే జంక్షన్ నుంచి.. అతిచిన్న స్టేషన్ వరకు.. భారతీయ రైల్వేల గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Indian Railway Interesting Facts: భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద నెట్‌వర్క్, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కుతుంటారు. ఇది భారతదేశంలో అత్యంత ఆర్థిక, సౌకర్యవంతమైన రవాణా మార్గంగా పేరుగాంచింది. అయితే ఈ రోజు మేం మీ కోసం రైల్వేలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీరు భారతీయ రైల్వేలో చాలాసార్లు ప్రయాణించి ఉండే ఉంటారు. మీరు రైలులో చాలా ఆహ్లాదకరమైన క్షణాలు అనుభవించే ఉంటారు. అయితే ఇప్పుడు సాధారణ ప్యాసింజర్ రైలును సిద్ధం చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రైలు తయారీకి భారతీయ రైల్వే సగటున రూ. 66 కోట్ల ఖర్చు చేస్తుంది.

వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే రూపురేఖలను మార్చాయి. అధునాతన సౌకర్యాలతో, ఇది ప్రయాణీకులలో బాగా ప్రాచుర్యం పొందింది. కొత్త తరం వందే భారత్ రైలు ధర ఎంతో తెలుసా? కొత్త తరం వందే భారత్ రైలు ధర తయారు చేసేందుకు రూ.115 కోట్లు ఖర్చవుతుంది.

భారతదేశంలో, ఎక్కువగా ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజిన్ రైళ్లు నడుస్తాయి. అయితే, ఇంజిన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? భారతీయ రైల్వేలకు ఒక ఇంజన్‌ను తయారు చేయడానికి రూ. 13-20 కోట్లు ఖర్చవుతుంది.

రైలులో ప్రయాణీకులు ప్రయాణించే ప్రదేశాన్ని కంపార్ట్‌మెంట్ లేదా కోచ్ అంటారు. కాగా, రైలు కంపార్ట్‌మెంట్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? ఒక రైల్వే కోచ్‌ను సిద్ధం చేయడానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతుంది. సాధారణ కోచ్ కంపార్ట్‌మెంట్ ధర తక్కువగా ఉంటుంది. అయితే AC కోచ్ ధర ఎక్కువగా ఉంటుంది.

భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశం. కొన్ని చోట్ల చాలా చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో అవి పెద్దవిగా ఉంటాయి. అయితే భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా? హౌరా భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్. ఇక్కడ 23 ప్లాట్‌ఫారమ్‌లు, 26 రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతిరోజు 600 రైళ్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి.

అలాగే అతి చిన్న రైల్వే స్టేషన్ గురించి కూడా తెలుసుకుందాం? భారతదేశంలోని అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు IB. ఇక్కడ కేవలం రెండు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే ఉన్నాయి.

Tags:    

Similar News