Petrol Rate: దేశంలో నాలుగో రోజు నిలకడగా పెట్రో ధరలు

Petrol Rate: మార్చి26న స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

Update: 2021-03-29 04:38 GMT

పెట్రోల్ (ఫైల్ ఫోటో)

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో వరుసగా నాలుగో రోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు..రోజువారీ ధరల సమీక్షలో భాగంగా మార్చి26న పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు సరఫరా సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 78 పైసలుగా వుండగా డీజిల్ ధర 81రూపాయల 10 పైసలు వద్దకి చేరింది. ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 19 పైసలుగా నమోదవుతోంది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 39 పైసలు. ఏపీలోని అమరావతి, విజయవాడల్లో 96 రూపాయల 87 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.08 శాతం తగ్గుదలతో 64.38 డాలర్లకు వద్దకు చేరగా డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.26 శాతం క్షీణతతో 60.83 డాలర్లుగా నమోదవుతోంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన సరఫరా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి.

Tags:    

Similar News