Fixed Deposit: ఈ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది.. ఎంతంటే..?

Fixed Deposit: పొదుపు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం బెస్ట్. బ్యాంకులు ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎక్కువగా పొదుపు చేసేవారు.

Update: 2022-04-29 12:30 GMT

Fixed Deposit: ఈ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది.. ఎంతంటే..?

Fixed Deposit: పొదుపు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం బెస్ట్. బ్యాంకులు ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎక్కువగా పొదుపు చేసేవారు. అయితే ఇప్పుడు ఇతర పొదుపు ఎంపికలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు వాటిలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా మందిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఇందులో మీ డబ్బుకి భద్రత, ఇంకా వడ్డీ వల్ల రాబడి రెండు ఉంటాయి. మీరు కూడా FD చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది.

అవును. Airtel Payments Bank తన కస్టమర్ల కోసం FD సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్‌తో జతకట్టింది. దీని కింద బ్యాంక్ FD పై 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. ప్రస్తుతం ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు FDపై గరిష్టంగా 6 శాతం వరకు వడ్డీని మాత్రమే ఇస్తున్నాయి. మీరు అవసరం రీత్యా లేదా ఇతర కారణాల వల్ల మెచ్యూరిటీకి ముందే FDని విచ్ఛిన్నం చేసినప్పటికీ బ్యాంక్ ఎలాంటి పెనాల్టీని విధించదు. బ్యాంక్ ఇచ్చిన సమాచారంలో ఎఫ్‌డి సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసింది.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా కస్టమర్‌లు రూ. 500 నుంచి రూ. 1,90,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై వారికి ఏటా 6.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లు అన్ని రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీని పొందుతారు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా మెచ్యూరిటీ పూర్తయ్యేలోపు కస్టమర్లు ఎఫ్‌డిని బ్రేక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి జరిమానా ఉండదు. ఎఫ్‌డీ సౌకర్యం ఒకటి, రెండు లేదా మూడేళ్లపాటు అందుబాటులో ఉంటుందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. కస్టమర్‌లు ఒకేసారి రెండు మూడు FDలు చేయవచ్చు.

Tags:    

Similar News