EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ ఈ పద్దతుల్లో సులువుగా తెలుసుకోండి..!
EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ ఈ పద్దతుల్లో సులువుగా తెలుసుకోండి..!
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి PFపై వడ్డీ రేటును 0.40 శాతం తగ్గించి 8.10%కి కుదించింది. మీడియా నివేదికల ప్రకారం, జూలై నాటికి వడ్డీ డబ్బు మీ PF ఖాతాలోకి రావచ్చు. దీనికి ముందు మీరు మీ PF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈ పద్దతులని అనుసరించడం ద్వారా మీరు బ్యాలెన్స్ సులభంగా చెక్ చేయవచ్చు. PF ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి మెస్సేజ్ వస్తుంది. అందులో PF బ్యాలెన్స్ గురించి సమాచారం ఉంటుంది.
SMS ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
EPFOతో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి 7738299899కి EPFO UAN LAN ద్వారా మీ పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు. LAN అంటే మీ భాష. మీకు ఆంగ్లంలో సమాచారం కావాలంటే LANకి బదులుగా మీరు ENG అని టైప్ చేయాలి. అదేవిధంగా హిందీకి HIN, తమిళం కోసం TAM అని టైప్ చేయాలి.
UMANG యాప్‌తో తెలుసుకోవచ్చు
మీరు UMANG యాప్ ద్వారా మీకు కావలసినప్పుడు మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. దీని కోసం UMANG యాప్‌లోని EPFOపై క్లిక్ చేయండి. ఇందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. తర్వాత వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత మీరు EPF బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.
మీరు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు
మీ PF బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి EPF పాస్‌బుక్ పోర్టల్‌ని సందర్శించండి. మీ UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ పోర్టల్‌కి లాగిన్ చేయండి. ఇందులో, డౌన్‌లోడ్ / వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. ఆపై పాస్‌బుక్ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో బ్యాలెన్స్ ఎంతుందో మీరు చూడవచ్చు.