EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి గమనిక.. త్వరలో ఈ ప్రయోజనాలు పొందే అవకాశం..

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) సాలరీ లిమిట్‌ని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని ప్రతిపాదించింది.

Update: 2022-04-22 10:30 GMT

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి గమనిక.. త్వరలో ఈ ప్రయోజనాలు పొందే అవకాశం..

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) సాలరీ లిమిట్‌ని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే 75 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశాలున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం జీతం పరిమితిలో చివరి సవరణ 2014లో జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. ఈపీఎఫ్‌వో జీత పరిమితిని పెంచడం ద్వారా కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. కానీ ఉద్యోగుల టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుంది. కానీ చివరికి ఆ పొదుపు అనేది భవిష్యత్‌లో ఉద్యోగులకే ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల పొదుపు పెరిగినట్లవుతుంది. EPSకి మరింత ఉపయోగపడుతుంది.

అయితే EPFO నిర్ణయించిన ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే దీన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై భారం పడనుంది. EPFO ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌పై ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. జీత పరిమితిని పెంచిన తర్వాత దానికి ప్రత్యేక కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. 15 వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు EPF పథకం అవసరం. ఇందులో ప్రభుత్వం ప్రాథమిక వేతనంలో 1.6 భాగాన్ని కాంట్రిబ్యూషన్‌గా ఇస్తుంది. వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.21 వేలకు పెంచడం ద్వారా 75 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు. చివరిసారిగా 2014లో జీత పరిమితిని రూ.15,000కు పెంచారు.

Tags:    

Similar News