EPFO: ఈపీఎఫ్‌వో అప్‌డేట్.. అధిక రాబడి కోసం త్వరలో కొత్త స్కీమ్..!
EPFO: ఈపీఎఫ్‌వో అప్‌డేట్.. అధిక రాబడి కోసం త్వరలో కొత్త స్కీమ్..!
EPFO: ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) తన ఖాతాదారులకి వయస్సు ఆధారంగా పెట్టుబడి ఎంపికలను అందిస్తోంది. ఈక్విటీలో అంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది. తద్వారా వారు అధిక రాబడిని పొందవచ్చు. అయితే వయసుపైబడిన ఖాతాదారులు వారి డబ్బును బాండ్లు లేదా సురక్షిత రుణాలలో పెట్టుబడి పెట్టే ఎంపికను ఎంచుకోవచ్చు. వాస్తవానికి ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకి అధిక రాబడిని అందించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుతం EPFO మొత్తం కార్పస్‌లో 15 శాతం మాత్రమే ఈక్విటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. అంటే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50, భారత్ 22 ఇండెక్స్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ప్రస్తుతం EPFO 15 లక్షల కోట్ల రూపాయల కార్పస్‌ను కలిగి ఉంది. మొత్తం 6 కోట్ల మంది ఖాతాదారులను కలిగి ఉంది. కస్టమర్లకి అధిక రాబడిని అందించడానికి EPFO 25 శాతం కార్పస్‌ను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి నిశ్చయించుకుంది.
ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన డబ్బును విడిగా పెట్టుబడి పెట్టాలని EPFO పరిశీలిస్తోంది. ఖాతాదారుల వయస్సు వారి రిస్క్‌ని బట్టి పెట్టుబడి పెడుతుంది. ఇందులో యువకుల ఫండ్స్‌లో ఎక్కువ భాగం ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది. వృద్ధుల పెట్టుబడులు సురక్షితమైన ప్రదేశాలలో పెట్టుబడి పెడుతుంది. పెన్షన్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది అధిక రాబడిని అందిస్తుంది. EPFO 2021-22లో తన ఖాతాదారులకు 8.10 శాతం రాబడిని అందించింది. ఇది బ్యాంక్ ఇచ్చిన రిటర్న్‌ల కంటే ఎక్కువ. కానీ దీర్ఘకాలికంగా అధిక రాబడిని ఇవ్వడం సాధ్యం కాదు. ఇందుకోసం పెట్టుబడి పద్ధతుల్లో పెనుమార్పుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం EPF రేటు 8.10 శాతానికి తగ్గింది. ఇది 1977-78 తర్వాత చాలా కనిష్ట స్థాయి.