మహిళ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ విషయంలో మళ్లీ ఛాన్స్ ఇచ్చిన ఈ పీఎఫ్‌వో..
Women Employees: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మహిళా ఉద్యోగులకి గుడ్‌న్యూస్ చెప్పింది.
Women Employees: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మహిళా ఉద్యోగులకి గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల కోసం 100% ఈ-నామినేషన్ సదుపాయాన్ని అందించాలని కోరింది. తద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ఈ సందర్భంగా EPFO ట్వీట్ చేస్తూ 'డిసెంబర్ 2021, జనవరి 2022 కోసం ఈ -నామినేషన్ చేయలేని కంపెనీలు ఈ 'డిక్లరేషియో'కి అర్హులవుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇప్పటివరకు ఈ నామినేషన్ చేయలని మహిళలకు అవకాశం కల్పించి సామాజిక భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం' అని ట్వీట్ చేసింది.
ఈపీఎఫ్‌వో ఈ-నామినేషన్ తప్పనిసరి
EPFO నామిని వివరాలు పొందుపరిచేందుకు ఈ-నామినేషన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. నామినీ పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేయవచ్చు. EPF ప్రతి ఖాతాదారుడు ఈ-నామినేషన్ పూర్తి చేయాలని చందాదారులను కోరింది. ఇలా చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే, నామినీ/కుటుంబ సభ్యులకు PF, పెన్షన్ (EPS) , ఇన్సూరెన్స్‌కి (EDLI) సంబంధించిన డబ్బును విత్ డ్రా చేయడానికి సులువవుతుంది. అవసరమైతే నామిని ఆన్‌లైన్‌లో డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
7 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం
EPFO సభ్యులు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI ఇన్సూరెన్స్ కవర్) కింద ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందుతారు. ఇందులో నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. అయితే ఈ నామినేషన్ లేకుండా సభ్యుడు మరణిస్తే దావాను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వెంటనే ఆన్‌లైన్‌లో నామినేషన్ పూర్తి చేయండి.