EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. పాత కంపెనీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని కొత్త కంపెనీకి బదిలీ చేయండి..!

EPFO: మీరు ఉద్యోగం లేదా కంపెనీని మార్చినట్లయితే ఖచ్చితంగా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని బదిలీ చేయండి.

Update: 2022-05-25 09:13 GMT

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. పాత కంపెనీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని కొత్త కంపెనీకి బదిలీ చేయండి..!

EPFO: మీరు ఉద్యోగం లేదా కంపెనీని మార్చినట్లయితే ఖచ్చితంగా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని బదిలీ చేయండి. తరచుగా వ్యక్తులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీలో మారుతూ ఉంటారు. అప్పుడు PF బ్యాలెన్స్‌ని బదిలీ చేయడం మర్చిపోతారు. కానీ ఇప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నాలుగు కంపెనీలు మారినప్పటికీ మీ PF బ్యాలెన్స్‌ను పాత కంపెనీ నుంచి మీ ప్రస్తుత కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. పాత EPF బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేయడానికి మీరు తప్పనిసరిగా యాక్టివ్ UAN నంబర్, పాస్‌వర్డ్‌ని కలిగి ఉండాలి. దీంతో పాటు మీ UAN నంబర్‌లో బ్యాంక్ ఖాతా నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి అన్ని రకాల సమాచారం అప్‌డేట్ అయి ఉండాలి.

PF ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయండి..?

ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లండి. తర్వాత UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత హోమ్ పేజీలోకి వెళుతారు. ఇక్కడ సభ్యుల ప్రొఫైల్‌కు వెళ్లండి. మీ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయండి. మీ పేరు, ఆధార్ వివరాలు, పాన్ కార్డ్ ధృవీకరించాలి. ఈ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను నింపాలి. PF బదిలీ చేయడానికి ముందు మీరు మీ పాస్‌బుక్‌ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పాస్‌బుక్ కనిపించే వ్యూలోకి వెళ్లాలి. పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు మరోసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎంచుకున్న సభ్యుల ఐడిపై క్లిక్ చేయాలి. వెంటనే పూర్తి జాబితా ఓపెన్‌ అవుతుంది. మీరు పనిచేసిన అన్ని కంపెనీల సభ్యుల IDలు కనిపిస్తాయి. దిగువన ఉన్న ID మీ ప్రస్తుత కంపెనీకి చెందినది. ఇక్కడ పాస్‌బుక్‌ని చూసి మీ అన్ని కంపెనీలలో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోండి.

పాత EPFని కొత్తదానికి బదిలీ చేయడం ఎలా..?

మీ పాత పీఎఫ్‌ని బదిలీ చేయడానికి ముందు కంపెనీ మీ ఎంట్రీ తేదీ, నిష్క్రమణ తేదీని అప్‌డేట్ చేసిందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు సర్వీస్ చరిత్ర ఎంపికపై క్లిక్ చేయాలి. పాత కంపెనీ రెండింటి తేదీలను అప్‌డేట్ చేసినట్లయితే మీ PF సులభంగా బదిలీ అవుతుంది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్ సేవలకు వెళ్లి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఖాతా (బదిలీ అభ్యర్థన)పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత సమాచారం, ఇప్పటికే ఉన్న కంపెనీ PF ఖాతా వివరాలను పొందే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీరు పాత PF డబ్బును పొందబోతున్నారు.

PF బదిలీ చేయడానికి పాత యజమాని వివరాలు ఉంటాయి. మీరు బదిలీ చేయబోయే PF ప్రస్తుత లేదా పాత యజమాని ఆమోదించాలని గుర్తుంచుకోండి. ఇప్పటికే ఉన్న కంపెనీ నుంచి అనుమతి పొందడం ఎల్లప్పుడూ సులభం. కాబట్టి ఈ ఎంపికను ఎంచుకోండి దీని తర్వాత మీరు మీ UAN వివరాలను ఎంటర్‌ చేయాలి. దీన్ని చేసిన వెంటనే మీ మునుపటి అన్ని కంపెనీల PF ID వస్తుంది. డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న ఐడీని ఎంచుకోండి. ఆ తర్వాత మీరు దానిని OTP ద్వారా ప్రామాణీకరించాలి. GET OTPపై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లెయిమ్ విజయవంతమైందని చూస్తారు. ధృవీకరణ కోసం మీరు ప్రింట్ తీసి మీ కంపెనీకి ఇవ్వాలి. అది PF కార్యాలయానికి పంపుతారు. 7 నుంచి 30 రోజులలో మీ పాత PF బ్యాలెన్స్ కొత్త ఖాతాకు బదిలీ అవుతుంది.

Tags:    

Similar News