EPFO: ఈపీఎఫ్‌వో వీరికి మినహాయింపు ప్రకటించింది.. అందులో మీరు ఉన్నారా..!

EPFO: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌వో) లో అకౌంట్‌ కలిగి ఉంటారు. వారి జీతం నుంచి కొంత అమౌంట్‌ ఇందులో పొదుపు అవుతూ ఉంటుంది.

Update: 2024-03-11 15:00 GMT

EPFO: ఈపీఎఫ్‌వో వీరికి మినహాయింపు ప్రకటించింది.. అందులో మీరు ఉన్నారా..!

EPFO: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌వో) లో అకౌంట్‌ కలిగి ఉంటారు. వారి జీతం నుంచి కొంత అమౌంట్‌ ఇందులో పొదుపు అవుతూ ఉంటుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఈ అమౌంట్‌ ద్వారా మీకు పెన్షన్‌ అందిస్తారు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఈపీఎఫ్‌వో కొంతమంది ఈపీఎఫ్‌ అకౌంట్‌ హోల్డర్స్‌కు ప్రధాన నియమం నుంచి ఉపశమనం అందించింది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను నింపడం నుంచి ఈపీఎఫ్‌వో కొంతమంది ఈపీఎఫ్‌ అకౌంట్‌ హోల్డర్స్‌కు మినహాయింపు ఇచ్చింది. సాధారణంగా ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉంటే అతడు ఈపీఎఫ్‌ అకౌంట్‌లో తన వాటాను డిపాజిట్ చేయడానికి యజమాని సంతకం చేసిన జాయింట్ డిక్లరేషన్‌ను సమర్పించాలి.ఇప్పుడు ఈ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను పూరించడం నుంచి కొంతమంది ఖాతాదారులకు EPFO మినహాయింపు ఇచ్చింది. దీని గురించి జనవరిలో సర్క్యులర్‌ జారీ చేసింది.

అయితే ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఈ నియమం వర్తించదు. వీరందరూ ఉమ్మడి డిక్లరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా అందించాలి. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన ఈపీఎఫ్‌ సభ్యులకు ఉమ్మడి డిక్లరేషన్ ఫారమ్‌ను పూరించకుండా మినహాయింపు ఇస్తుంది. అలాగే మరణించిన వారి ఖాతా ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటే ఈ ఫారమ్ నింపడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ రెండు కేటగిరీలలో స్టాండర్డ్ పరిమితి రూ. 15,000 కంటే ఎక్కువ జమ చేసి ఉద్యోగం నుంచి నిష్క్రమించిన లేదా అక్టోబర్ 31, 2023లోపు మరణించిన ఖాతాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

Tags:    

Similar News