EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. అకౌంట్లో డబ్బులు జమయ్యాయా..!
EPFO Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకి వడ్డీని జమచేసే ప్రక్రియను ప్రారంభించింది.
EPFO Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకి వడ్డీని జమచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈపీఎఫ్‌వో అక్టోబర్ 31న ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు స్పందించిన ఈపీఎఫ్‌వో వడ్డీని బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించామని, త్వరలో డబ్బు లబ్ధిదారుల ఖాతాకు చేరుతుందని తెలిపింది. ఇది కాకుండా వడ్డీలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని వెల్లడించింది.
ఈసారి ఈపీఎఫ్‌వో 6 కోట్ల మంది ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీని బదిలీ చేస్తుంది. విశేషమేమిటంటే మొత్తం పీఎఫ్ ఖాతాల సంఖ్య దాదాపు 25 కోట్లు అందులో చాలా ఖాతాలు క్రమం తప్పకుండా పీఎఫ్ జమ చేయని ఖాతాలే. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈసారి వడ్డీ బదిలీలో జాప్యం జరిగిందని సంస్థ తెలిపింది. లబ్ధిదారులు 2021-22 కోసం డిపాజిట్లపై వడ్డీని పొందుతున్నారు. మీరు మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని అనేక మార్గాల్లో తెలుసుకోవచ్చు.
SMS ద్వారా
మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి EPFO UAN LANని పంపాలి. ఇక్కడ LAN అంటే భాష. మీకు హిందీలో సమాచారం కావాలంటే HIN, ఆంగ్లంలో సమాచారం కావాలంటే ENG అని పంపాలి. అదేవిధంగా ఇతర భాషల ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.
UMANG యాప్ ద్వారా
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని UMANG యాప్ ద్వారా PF ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. UMANG యాప్‌కి వెళ్లి EPFOని ఎంచుకోండి. ఎంప్లాయీస్ సెంట్రిక్ సర్వీస్ తెరవండి. తర్వాత 'వ్యూ పాస్‌బుక్' ఎంపికను ఎంచుకుని UN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. మీ మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. బ్యాలెన్స్ మీ ముందు ఉంటుంది.
మిస్డ్ కాల్ ద్వారా
మీరు UN పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లయితే 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతాలోని బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. ఈ సేవ కోసం మీ బ్యాంక్ ఖాతా నంబర్, పాన్, ఆధార్ నంబర్‌ను UANతో లింక్ చేయాలి. ఇది కాకుండా మీరు EPFO వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.