EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. ఈ నెంబర్ పోయినట్లయితే పెన్షన్ కట్‌..!

EPFO Alert: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఈ విషయాన్ని కచ్చితంగా గమనించాలి.

Update: 2022-10-13 09:31 GMT

EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. ఈ నెంబర్ పోయినట్లయితే పెన్షన్ కట్‌..!

EPFO Alert: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఈ విషయాన్ని కచ్చితంగా గమనించాలి. PPO నంబర్ (Pension Payment Order) పోయినట్లయితే పెన్షన్ ఆగిపోతుందని గుర్తుంచుకోండి. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద పెన్షనర్లకు పీపీవో అని పిలవబడే ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. దీని ఆధారంగా ఉద్యోగులు రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్ పొందుతారు. ఒకవేళ ఈ నెంబర్ కోల్పోయినట్లయితే పెన్షన్ ఆగిపోతుంది.

వాస్తవానికి ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్‌ పొందిన ఉద్యోగులకి ఈపీఎఫ్‌వో PPO నంబర్ జారీ చేస్తుంది. ఇది లేకుండా పింఛను అందదు. అందుకే దీనిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. వాస్తవానికి ఈపీఎఫ్‌వో ఉద్యోగి జీతం, తదితర వివరాలన్నింటిని పరిశీలించి పీపీవో నెంబర్ కేటాయిస్తుంది. అయితే ఈ నెంబర్ పోయినట్లయితే మళ్లీ పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/site_en/index.php కి వెళ్లాలి.

2. 'ఆన్‌లైన్ సర్వీసెస్' విభాగంలో 'పెన్షనర్స్ పోర్టల్' ఎంపికపై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 'మీ PPO నంబర్‌ను తెలుసుకోండి'అనే దానిపై క్లిక్ చేయండి.

4. ఇక్కడ ప్రతి నెలా పెన్షన్ వచ్చే మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయాలి. అంతేకాదు PF నంబర్‌ను నమోదు చేయడం ద్వారా కూడా సెర్చ్‌ చేయవచ్చు.

5. అన్ని వివరాలను నింపిన తర్వాత ఓకె చేయాలి.

6. తర్వాత స్క్రీన్‌పై PPO నంబర్‌ని చూస్తారు.

PPO నంబర్ తప్పనిసరి

పీపీవో నెంబర్ 12-అంకెల సంఖ్య. ఇది మీకు సూచనగా పనిచేస్తుంది. దీని ద్వారా సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. పెన్షనర్ పాస్‌బుక్‌లో PPO నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరొక శాఖకు బదిలీ చేయడం సులభం. ఏ రకమైన పెన్షన్ సంబంధిత పని లేదా ఫిర్యాదు కోసం EPFOలో PPO నంబర్ తెలియజేయడం తప్పనిసరి. పెన్షన్ స్టేటస్‌ని చూడటానికి కూడా పీపీవో నెంబర్ ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News