Employees Alert: ఉద్యోగులు అలర్ట్.. డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి చేయండి..
Employees Alert: ఉద్యోగులందరు ఒక విషయాన్ని గమనించాలి. ఈపీఎఫ్‌వోలో నామినీ పేరు అప్‌డేట్ చేయాలి. లేదంటే పెన్షన్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నెల31లోపు ఈ పని పూర్తి చేయాలి. నామినీ వివరాలు అప్‌డేట్ కాకపోతే ఈపీఎఫ్ అందిస్తున్న ఎటువంటి ప్రయోజనాలు పొందలేరు. ఇందులో పెన్షన్, బీమా డబ్బు ఇంకా చాలా సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి. PF సబ్‌స్క్రైబర్ మరణిస్తే, నామినీకి మాత్రమే అతని PF ఖాతా నుంచి డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకునే హక్కు ఉంటుంది.
PF సబ్‌స్క్రైబర్ నామినీగా ఒకరి కంటే ఎక్కువ మందిని చేర్చుకునే హక్కు ఉంటుంది. బహుళ నామినీల విషయంలో సభ్యులందరి వాటాను అతను ముందుగానే నిర్ణయించవచ్చు. నామినీలను అప్‌డేట్ చేయడం ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇందుకోసం యూఏఎన్ నంబర్ కలిగి ఉండాలి. అలాగే మీ ఆధార్ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి. ఈ సంవత్సరం మే నెలలో EPFO EDLI ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ. 7 లక్షలకు పెంచింది.
EDLI పథకం కింద PF సభ్యుడు మరణిస్తే నామినీ ఈ మొత్తాన్ని పొందుతారు. అయితే ఈ వ్యవధిలో పీఎఫ్ సభ్యుడు సర్వీస్‌లో ఉండటం తప్పనిసరి. ఈ పథకం కింద కనీస బీమా మొత్తం రూ. 2.5 లక్షలు ఉంటుంది. EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. లాగిన్ అయిన తర్వాత వ్యూ ఆప్షన్‌లోకి వెళ్లి ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ PF సభ్యుల సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ముందుగా మీకు సంబంధించిన మొత్తం సమాచారం సరైనదేనా కాదా అని తనిఖీ చేయండి.
సమాచారం అంతా సరైనదైతే మేనేజ్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ఈ-నామినేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ప్రాసెస్ చేయవలసిన మీ ప్రొఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫ్యామిలీ డిక్లరేషన్‌తో అవును, కాదు అనే ఆప్షన్ ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవునుపై క్లిక్ చేయండి ఆ తర్వాత మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నామినీ ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోటోతో సహా మొత్తం సమాచారాన్ని నింపాలి. మీరు ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేయాలనుకుంటే న్యూ పై క్లిక్ చేయండి. మీరు ఒక నామినీని మాత్రమే ఉంచుకోవాలనుకుంటే సేవ్ వివరాలపై క్లిక్ చేయాలి.