Eggs Demand: అక్కడ గుడ్లకి యమ డిమాండ్.. కారణం తెలిస్తే షాక్..!
Eggs Demand: సండే అయినా మండే అయినా ప్రతిరోజు గుడ్డు తినండి. టీవిలో వచ్చే ఈ యాడ్ అందరికి గుర్తుండే ఉంటుంది.
Eggs Demand: సండే అయినా మండే అయినా ప్రతిరోజు గుడ్డు తినండి. టీవిలో వచ్చే ఈ యాడ్ అందరికి గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. కారణం ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్. అదేంటి గుడ్లకి , ఫిపా ప్రపంచకప్‌కి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ నిజం తెలుసుకోండి. వాస్తవానికి ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి గుడ్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.
గుడ్ల ఉత్పత్తిలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో సుమారు 1,100 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటిలో 700 ఒకే జిల్లా చుట్టూ ఉన్నాయి. ఈ జిల్లా పేరు'నమక్కల్'. సాధారణంగా తమిళనాడు నుంచి ఖతార్‌కు ప్రతి నెల కోటి కోడిగుడ్లు ఎగుమతి అవుతాయి. అయితే గత రెండు నెలల నుంచి 2.5 కోట్లకి పెరిగింది. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ దీనికి ప్రత్యక్ష కారణం. తమిళనాడులోని నమక్కల్‌లో ప్రతిరోజూ 60 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి.
ఇక్కడి నుంచి కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గుడ్లు సరఫరా అవుతాయి. దేశంలో కోడిగుడ్ల సరఫరాలో నామక్కల్‌కు సాటి లేదు. ఫిఫా ప్రపంచకప్ కారణంగా ఖతార్‌లో గుడ్లకు డిమాండ్ పెరగగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల్లో గుడ్ల ధరలు పెరిగాయి. తమిళనాడులోని పౌల్ట్రీ ఫారాలు దీని వల్ల లాభపడ్డాయి. గుడ్ల ఎగుమతి ఖతార్‌కు మాత్రమే పెరగలేదు. ఇతర దేశాల్లోనూ గుడ్లకు డిమాండ్ పెరిగింది.