Driving License: వారం రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్టీఓ ఆఫీసుకి వెళ్లాల్సిన పనిలేదు..!
Driving License: ఈ రోజుల్లో రోడ్డుపై వాహనం నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే.
Driving License: ఈ రోజుల్లో రోడ్డుపై వాహనం నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లేదంటే జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి గతంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. రోజుల తరబడి క్యూలో నిలబడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు. కానీ కాలంతో పాటు ఇప్పుడు పరిస్థితులు కూడా మారాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.
గతంలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి RTO ఆఫీసుకి వెళ్లవలసి ఉండేది. కానీ ఇప్పుడు ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్ నుంచి సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది. వాస్తవానికి భారత ప్రభుత్వం డిజిటలైజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. తద్వారా ఆన్‌లైన్‌లో లెర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి సారి లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్‌లైన్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్లై చేసే విధానాన్ని తెలుసుకోండి.
డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ కోసం ఇలా అప్లై చేసుకోండి
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.doకి వెళ్లాలి.
2. ఇందులో రాష్ట్రాన్ని ఎంపిక చేసి లెర్నర్స్ లైసెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. తర్వాత ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఆధార్ వివరాలతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
4. ఇప్పుడు మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలి. రూ.50 రుసుము చెల్లించాలి.
5. అంతే దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్లే. 7 రోజులలోపు లెర్నింగ్ లైసెన్స్ మీ ఇంటికి వస్తుంది.
6. అయితే పర్మినెంట్ లైసెన్స్ పొందాలంటే మాత్రం కచ్చితంగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని గుర్తుంచుకోండి.