Save Money Tips: మీ సంపాదన ఒకే దగ్గర పొదుపు చేశారా.. అయితే నష్టమే ఎందుకంటే..?

Save Money Tips: మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒకే ఖాతాలో పొదుపు చేశారా.. అయితే చాలా నష్టపోతారు జాగ్రత్త.

Update: 2023-03-17 14:30 GMT

Save Money Tips: మీ సంపాదన ఒకే దగ్గర పొదుపు చేశారా.. అయితే నష్టమే ఎందుకంటే..?

Save Money Tips: మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒకే ఖాతాలో పొదుపు చేశారా.. అయితే చాలా నష్టపోతారు జాగ్రత్త. నిబంధనల ప్రకారం ఒక ఖాతాలో 5 లక్షల కంటే ఎక్కువ పొదుపులను ఉంచకూడదు. ఎందుకంటే మీ పొదుపు చేసిన బ్యాంకు దివాళతీసినట్లయితే కేవలం రూ.5 లక్షల రూపాయలకి మాత్రమే భద్రత ఉంటుంది. మీ ఖాతాలో ఐదు లక్షల కన్నా ఎంత ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ మీకు 5 లక్షలు మాత్రమే చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తుంచుకొని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.

మీరు మీ ఖాతాలో రూ.5 లక్షల పొదుపు అలాగే మరో రూ.3 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లయితే బ్యాంకు కుప్పకూలినప్పుడు మీరు 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. బ్యాంకు ఇంత డబ్బు మాత్రమే రీఫండ్ చేస్తుంది. క్లెయిమ్‌లో మీరు 90% మాత్రమే పొందుతారు. వాస్తవానికి గత 50 ఏళ్లలో దేశంలో ఏ బ్యాంకు కూడా దివాళా తీయలేదు. అయినప్పటికీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మునిగిపోకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

డబ్బును ఆదా చేయడానికి వివిధ బ్యాంకుల్లో పొదుపు చేయాలి. లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. దీనివల్ల నష్ట ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బ్యాంకు డబ్బును వివిధ బ్యాంకుల్లో ఉంచడం వల్ల పొదుపుపై ఎలాంటి ప్రభావం పడదు. మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. డిపాజిట్ బీమా కవరేజీని కూడా బ్యాంకులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాయి. ఏదైనా ఒక బ్యాంకులో వ్యక్తి ఖాతాలన్నింటినీ కలుపుకుంటే ఐదు లక్షల గ్యారెంటీ మాత్రమే ఉంటుంది.

Tags:    

Similar News