LIC Policy Rules: ఎల్‌ఐసీ పాలసీదారులకి అలర్ట్.. పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దు..!
LIC Policy Rules: ఎల్‌ఐసీ పాలసీ తీసుకునేముందు కచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి.
LIC Policy Rules: ఎల్‌ఐసీ పాలసీ తీసుకునేముందు కచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కుటుంబంలో ఒకరిని తప్పనిసరిగా నామినీగా చేయాలి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు వచ్చే మొత్తాన్ని కోల్పోతారు. అంటే పాలసీ క్లెయిమ్‌ను చేయడంలో కుటుంబానికి ఎలాంటి హక్కు ఉండదు. దీని గురించి మరిన్నివివరాలు తెలుసుకుందాం.
ఒకటి కంటే ఎక్కువ నామినీలు
సాధారణంగా వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని నామినీగా చేస్తారు. అయితే మీ డబ్బును ఇద్దరు వ్యక్తుల మధ్య షేర్ చేయాలంటే భార్య బిడ్డ లేదా భార్య సోదరుడు లేదా తల్లి తండ్రికి షేర్ చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ నామినీలని ఎంచుకోవాలి. అయితే పాలసీని కొనుగోలు చేసే సమయంలో వ్యక్తుల వాటాను నిర్ణయించి నామినీగా చేయాలి. బీమా సంస్థ నుంచి రాతపూర్వక బాధ్యత తీసుకోవాలి.
పాలసీ తీసుకునే సమయంలో నామినీ పేరును నిర్ణయించాలి. మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదిస్తున్న సభ్యులు అయితే మీరు లేనప్పుడు ఆర్థిక బాధ్యత వహించే సామర్థ్యం ఉన్నవారిని నామినీగా ఎంచుకోవాలి. ఎక్కువగా ఈ బాధ్యత జీవిత భాగస్వామియే చేస్తుంది. అప్పుడు ఆమెని నామినీగా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహాయం పొందుతారు.
కాలానుగుణంగా నామినీల మార్పు..
పాలసీదారుడు కాలానుగుణంగా నామినీని మార్చుకోవచ్చు. ఒక నామినీ చనిపోయిన సందర్భంలో లేదా మరొక సభ్యునికి ఎక్కువ డబ్బు అవసరమైన సందర్భంలో నామినీని మార్చుకోవచ్చు. ఇది కాకుండా నామినీ వివాహం లేదా విడాకుల సందర్భంలో కూడా మారవచ్చు. దీని కోసం మీరు బీమా కంపెనీ వెబ్‌సైట్ నుంచి నామినీ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఫారమ్‌లో నామినీ వివరాలను నింపి పాలసీ డాక్యుమెంట్ కాపీని, మీ రిలేషన్‌షిప్ డాక్యుమెంట్‌లను నామినీకి సమర్పించాలి. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి వాటాను కూడా నిర్ణయించాలి.