Stock Market: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: 636 పాయింట్లు నష్టపోయి 60,657 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
Stock Market: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూల సంకేతాలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశ వివరాలు ఈ రాత్రి వెలువడనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏ దశలో కూడా కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 60 వేల 657కి పడిపోయింది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 18 వేల42కు దిగజారింది.